Friday, April 26, 2024

బెంగాల్ అసెంబ్లీలో సిబిఐ, ఇడి అధికారులపై సభాహక్కుల తీర్మానం..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీలో ఓ సిబిఐ అధికారి, ఓ ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారిపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా టిఎంసికి చెందిన ముగ్గురు ఎంఎల్‌ఎలను సిబిఐ అరెస్ట్ చేసిందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ చర్యలు స్పీకర్‌ను అవమానించడంగా పేర్కొన్నారు. టిఎంసి మంత్రి తపస్‌రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభాహక్కుల కమిటీకి స్పీకర్ బిమన్‌బెనర్జీ సిఫారసు చేశారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరిపి వచ్చే సమావేశాల్లో తనకు సమర్పించాలని కమిటీని స్పీకర్ ఆదేశించారు. సిబిఐ డిప్యూటీ ఎస్‌పి సత్యేంద్రసింగ్, ఇడి అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్‌బిశ్వాస్‌పై ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.

Bengal Assembly moves Privilege Motion on CBI and ED officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News