Friday, May 3, 2024

వింత కాంతుల దుమ్ము రేపుతూ దూసుకొస్తున్న తోకచుక్క

- Advertisement -
- Advertisement -

Comet neowise will be visible this weekend

దుబాయ్ : నియోవైస్ అనే తోకచుక్క భూమివైపు దూసుకువస్తోంది, ఖగోళంలో ఇది వింతకాంతులు విరజిమ్ముతూ ఉండటాన్ని మెక్‌కెంజీలని డీ రైట్ అబ్జర్వేటరీ నుంచి చిత్రీకరించారు. మౌంట్ వాషింగ్టన్ ఎగువ గగనతలంలో ఈ కామెట్ రాత్రిపూట దట్టమైన చీకట్లను చీల్చుకుంటూ వేయికోట్ల కాంతిపుంజాల స్థాయిలో మెరిస్తోంది. అమెరికా ఇతర ప్రాంతాల్లో ఈ సుందరదృశ్యం తళుక్కుమంటోంది. నాసా అంతరిక్ష కేంద్రం ఈ తోకచుక్క గురించి వివరాలు తెలిపారు. ఈ కామెట్ తోక విశాలమైన రీతిలో ఉంది. దుమ్మూధూళితో మసకమసకగా ఉందని వెల్లడిచారు.

ఈ తోక చుట్టూ ఉన్న దుమ్ము కామెట్ ప్రధాన కేంద్రంవైపు సాగుతోందని గుర్తించారు. తోకచుక్క కన్పించని తీరులో ఇది రేపుతున్న దుమ్ము ఉందని వెల్లడించారు. దీని తోక భాగం అంతా వాయువులతో నిండి ఉన్నట్లు గుర్తించారు. దీనిలోని ఎలక్ట్రానులు విరజిమ్ముతూ ఉండటంతో ఈ కామెట్ ఇప్పుడు అతి భారీ తారాజువ్వలాగా గోచరిస్తోంది. ఇది భూమి వైపు వస్తోందని గుర్తించారు. సూర్యుడి కాంతిలోకి ఈ ఎలక్ట్రాన్లు ప్రసరితం అవుతున్నాయి. ఈ కామెట్‌ను నియోవైస్ లేదా సి/2020 ఎఫ్ 3గా పిలుస్తున్నారు. ఈ కాంతిపుంజాల తోకచుక్క ఇప్పుడు పర్వతశ్రేణుల ఎగువన ఏడు పర్వతాల అత్యద్భుతంగా ఉందని ప్రముఖ చిత్రకారుడు రాండినోనే లాస్‌వేగాస్ కేసియోలో నుంచి వ్యాఖ్యానించారు.

Comet neowise will be visible this weekend

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News