Saturday, May 4, 2024

అభివృద్ధి పనుల ప్రాంరంభం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మ గూడెం, ఇండ్లూరు గ్రామాల్లో శనివారం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ప్రారంభించారు. అద్దంకి హైవే నుండి తిప్పలమ్మగూడెం వరకు పంచాయతీరాజ్ 17.40 లక్షల వ్యయంతో బీటీ రెన్యువల్ రోడ్డును,ఎఫ్డిఆర్ 20 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు కల్వర్టు పనులను ప్రారంభించారు.అనంతరం ఇండ్లూరులో ఇండ్లూరు నుండి చందనపల్లి వరకు..4.34 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ అండ్ బి బిటి రోడ్డు రెన్యువల్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ 20 ఏళ్లుగా గత పాలకుల చేతిలో నిర్లక్ష్యాన్ని గురైన నల్లగొండ నియోజక వర్గం ఇచ్చిన మాట ప్రకారం కెసిఆర్ నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 1150 కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారనిఅనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు నల్లగొండలో శరవేగంగా నిర్మాణ ం పూర్తి చేసుకుంటున్నాయని గతంలో ఈ ప్రాంత ంలో పర్యటించినప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజలు ఇండ్లుర్ చందనపల్లి రోడ్డు అధ్వానంగా మారిందని వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తమకు తెలియజేసిన వెంటనే ఈ రోడ్డు బీటీ రెన్యువల్ కోసం మంత్రితో మాట్లాడి 4.34 కోట్ల రూపాయలు మంజూరు చేయించి నేడు పనులు ప్రారంభిస్తున్నామన అన్నారు.

అదేవిధంగా ఇండ్లూరు ఆగా మోత్కూరు వరకు రోడ్డు నిర్మానానికి నిధులు మంజూరు చేయిస్తామని, అలాగే మోత్కూరు నుండి సందెనపల్లి వరకు డబల్ రోడ్డు కు కూడా ప్రయత్నం చేస్తామని దీంతో అనేక గ్రామాలకు లింక్ రోడ్ సౌకర్యం ఏ ర్పడి ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు.ఇప్పటికే మామిడాల గోదావరి గూడెం వా గుపై నాలుగున్నర కోట్లతో బ్రిడ్జి పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఇండ్లూరు ఎస్సీ కాలనీ క మ్యూనిటీ హాల్ కొరకు పది లక్షల రూపాయల సిడిపి నిధులను మం జూరు చేస్తున్నామని తిప్పలమ్మ గూడెంలో కూడా సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ లో లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మండల రైతు బంధు కమిటీ కోఆర్డినేటర్ ముత్తినేని శ్యాంసుందర్ నాయకులు లొడంగి గోవర్ధన్, వల్లపు రెడ్డి కోటిరెడ్డి, గుండా సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దొంతమ్ ఇంద్రసేనారెడ్డి, వైస్ సింగిల్ విండో చైర్మన్ కందుల రేణుక లక్ష్మయ్య ఎంపీటీసీ సందీప్ రెడ్డి,సర్పంచ్ లు తదితరులు వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News