Saturday, May 4, 2024

ఎపిలో మతమార్పిడులపై 18 ఎన్‌జిఓలపై ఫిర్యాదులు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

Complaints against 18 NGOs over religious conversions in AP

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల(నియంత్రణ) చట్టం(ఎఫ్‌సిఆర్‌ఎ) కింద ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన 18 స్వచ్ఛంద సంస్థలు(ఎన్‌జిఓలు) మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. ప్రలోభాలు, తప్పుడు ప్రచారం ద్వారా క్రైస్తవంలోకి మత మార్పిడులకు ఈ సంస్థలు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. ఎప్‌సిఆర్‌ఎ-2010 ప్రకారం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అటువంటి సంస్థలపై చర్యలకు చట్టపరమైన చర్యలు చేపట్టవలసి వస్తుందని మంత్రి తెలిపారు. ఆ సంస్థల అకౌంట్లను ఆడిటింగ్ చేయడం, అకౌంట్లు, రికార్డుల తనిఖీలు, వారి క్షేత్రస్థాయి కార్యకలాపాల పరిశీలన వంటివి చేపట్టవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఫిర్యాదులలోని నిజానిజాల ఆధారంగా అటువంటి ఎన్‌జిఓలకు సంబంధించిన ఎఫ్‌సిఆర్‌ఎ సర్టిఫికెట్లను సస్పెండ్ చేయవలసి ఉంపందని ఆయన అన్నారు. సర్టిఫికెట్ల రద్దుకు కూడా ఇది దారితీయవచ్చని ఆయన వివరిచారు. ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News