Tuesday, April 30, 2024

మిశ్రా బర్తరఫ్ కోరుతూ ప్రతిపక్ష ఎంపిల ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

Rahul Leads March Against Mishra Over Lakhimpur Incident

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు మంగళవారం నాడిక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి అజయ్ మిశ్రాను జైలుకు పంపేవరకు తాము విశ్రమించబోమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్లమెంట్ సముదాయంలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు నిరసన యాత్ర నిర్వహించారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో మంత్రి మిశ్రా కుమారుడు ఇప్పటికే అరెస్టు అయిన దృష్టా మంత్రిని తక్షణమే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించిన ప్రతిపక్ష ఎంపీలు మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ డిమండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News