Wednesday, May 1, 2024

రిఫైండ్ పామాయిల్ దిగుమతి సుంకం 12.5 శాతానికి తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Reduction of refined palm oil import duty to 12.5 per cent

 

న్యూఢిల్లీ : వంట నూనెల రిటైల్ ధరలను తగ్గించడానికి, స్వదేశీ సరఫరాలను పెంచడానికి వీలుగా రిఫైండ్ పామాయిల్ దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని( బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) 17.5 శాతం నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వచ్చే మార్చి వరకు ఈ తగ్గింపు అమలులో ఉంటుంది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఎలాంటి లైసెన్సు అవసరం లేకుండా వ్యాపార్లు రిఫైండ్ పామాయిల్‌ను దిగుమతి చేసుకోడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తదుపరి రిఫైండ్ పామాయిల్‌పై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్, లేదా ఇతర వ్యవసాయ పంటలకు సంబంధించి కొత్తగా ఎలాంటి కాంట్రాక్టులు కుదుర్చుకోరాదని నిషేధం విధించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఈ చర్యలన్నీ ప్రభుత్వం చేపట్టడం గమనార్హం. కస్టమ్ డ్యూటీ తగ్గింపు మంగళవారం నుంచి అమలు లోకి వస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News