Saturday, May 4, 2024

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్య తనిస్తూ ప్రజల నుండి వ చ్చి న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమా వేశం హాల్‌లో ఏర్పాటు చేసి న ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 130 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులలో ఆసరా పెన్షన్‌కు సబంధించి 18 దరఖాస్తులు, భూ సమస్యలు, భూ సర్వే , ఎలక్ట్రిసిటి, రెవెన్యూ, వివిధ శాఖల నుండి 112 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులు పరి ష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన దరఖా స్తులను పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్న ప్రతి ఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ఆర్డీఓ రాములు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News