Sunday, May 5, 2024

స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయండి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ :- నగరంలోని స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి.ఎల్.వర్మ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రికి బల్దియా కమిషనర్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ నగర పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ఆదివారం కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ కింద పూర్తయిన, కొనసాగుతున్న పనులను స్మార్ట్ సిటీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఈఓ, మనేజింగ్ డైరెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మంత్రి కి పనుల పురోగతిని వివరిస్తూ స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేశామని,కొన్ని పనులు అక్టోబర్ మాసం వరకు, మరికొన్ని అభివృద్ధి పనులు డిసెంబర్ మాసం వరకు పూర్తి కానున్నట్లు తెలిపారు.

ప్రతి 15 రోజుల కొకసారి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రతినిదులు స్మార్ట్ సిటీ కి ఎంపికైన నగరాల సిఈఓ లతో పనుల పురోగతి పై దృశ్య మాధ్యమం ద్వారా రివ్యూ నిర్వహిస్తున్నారని, ఎప్పటి కప్పుడు పనుల పురోగతిని వారికి తెలుపుతున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజల కు కూడా అందాలనేదే ప్రధాని ఆకాంక్ష అని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని,స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరలో క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఎస్. ఈ. ఎస్సీ ప్రవీణ్ చంద్ర, ఈ.ఈ. శ్రీనివాస్, డి. ఈ.లు రవికుమార్ ,రవికిరణ్, సారంగం, ఏ.ఈలు అజ్మీర శ్రీకాంత్, సంతోష్ తో పాటు స్థానిక నాయకులు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఏనుగు రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News