Thursday, May 16, 2024

నిర్మాణం పూర్తైన డ బుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

మారేడుపల్లి : సికింద్రాబాద్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇవ్వడం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఘనత అని అఖిల పక్ష పార్టీల నాయకులు కాంపల్లి శ్రీనివాస్ (సిపిఐ), అజయ్‌బాబు (సిపిఎం) అన్నారు. మంళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం నిర్లక్షం, అక్రమాలను నిరసిస్తూ చిలకలగూడ గాంధీ విగ్రహాం ఎదుట అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్లకార్డులు చేత బూని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తూ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం జాప్యం చేస్తున్నారనారు. నియోజకవర్గంలో పదివేల ఇండ్లను నిర్మిస్తానని హామీనిచ్చిన డిప్యూటీ స్పీకర్ కేవలం 400 ఇండ్లు మాత్రమే నిర్మించడం శోచనీయమని అందులో కేవలం బిఆర్‌ఎస్ నాయకులకే కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది కేవలం బిఆర్‌ఎస్ నాయకులకే లబ్ధి చేకూరేలా ఉందని దుయ్యాబట్టారు. దోబీగాట్‌లో నిర్మాణం పూర్తయి రెండేడ్లు గడుస్తున్న ఇప్పటికి లబ్ధిదారులకు ఇవ్వకుండా తన ప్రతినిధులకు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఆజాది చంద్రశేఖర్‌నగర్‌లో నిర్మించిన 48 ఇండ్లలో పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగాయిని వారు ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపు స్థానిక ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పేదలకు, అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని, నియోజకవర్గంలోని అర్హత కలిగిన పేదలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలలో అవినీతి, అక్రమాలు జరిగితే అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అఖిల ప క్ష నాయకులు ఉమ్మర్ ఖాన్, కొమురెల్లి, జేరిపోతుల కుమార్, రవికాంత్, రామప్ప, ఎల్లయ్య, అజయ్ బాబు, జావేద్, తోకల సోమయ్య, పాకాల యాదగిరి, షేక్ లతీఫ్, రషీద్, రమేష్, లక్ష్మణ్, గడ్డం యాదగిరి, లక్ష్మి, పులి కంటి వీరయ్య, ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News