Saturday, May 4, 2024

రిజర్వాయర్ల వద్ద భద్రత గాలికి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరానికి తాగు జలాలు అందించే రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద భద్రత గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ముషీరాబాద్ రిసాలగడ్డ సంఘటనతో 100 మంది ప్రైవేటు సెక్యూరిటీని నియమించి విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. నియమించిన సెక్యూరిటీ సిబ్బంది ఐదారు నెల పాటు విధులు నిర్వహించి, తరువాత అడిగే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా విధులకు హాజరైతూ దర్జాగా నెల వేతనం తీసుకుంటున్నట్లు స్దానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సంఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం తప్ప పూర్తి స్దాయిలో పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సెక్యూరిటీ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు వస్తే సక్రమంగా విధులు నిర్వహించాలని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో తమ మాట వినడం లేదని డివిజన్ అధికారులు వెల్లడిస్తున్నారు.

జలమండలి వివిధ విభాగాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడు విధులకు వస్తారో, వచ్చి ఎం చేస్తారో ఎవరికి తెలియదని, ప్రశ్నిస్తే ఫలాన అధికారి బాగా తెలుసు నాగురించి డివిజన్ అధికారులు వాకబు చేయాల్సి పనిలేదని తిరిగి ప్రశ్నిస్తూ కాల క్షేపం చేస్తున్నారని పేర్కొంటున్నారు. కొంతమంది అధికారులు బినామీ సిబ్బందిని నియమించుకుని వారి పేరు మీద బ్యాంకుల్లో నగదు జమ చేసి తమ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కోర్ సిటీలో 378 సర్వీస్ రిజర్వాయర్లు ఉండగా వాటి వద్ద 24 గంటల పాటు భద్రత ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ల ప్రాంగణాలకు వాటర్ ట్యాంకుల వద్దకు ఇతరులు రాకుండా, ఎలివేటెడ్ రిజర్వాయర్ల వద్ద పైకి వెళ్లే మెట్ల దగ్గర గేటు అమర్చి తాళం ఏర్పాటు చేసి బయట వారు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల బయట ఇతరులకు అనుమతి లేదని చెబుతూ నిషేదిత స్దలం అనే సూచిక బోర్డులు ఏర్పాటు, రిజర్వాయర్లలోకి దిగడానికి ఏర్పాటు చేసి మూతలు, గేట్లకు తాళాలు వేస్తామని జాగ్రత్తలు చెప్పి వెంటనే రిజర్వాయర్ల భద్రత కోసం 100 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించారు. వీరితో పాటు వివిధ విభాగాల్లో సుమారు 200మంది అదనపు సిబ్బందితో పాటు రిజర్వాయర్ల తనిఖీలకు నాలుగు ప్లయింగ్ స్వాడ్లను ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండా 600 సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని, కెమెరాల అనుసంధానం స్దానిక పోలీసుస్టేషన్‌కు చేశారు. ప్రస్తుతం నిఘా నేత్రాలు మాత్రమే రిజర్వాయర్ల కాపాడుతున్నాయి.

ప్రస్తుతం ఎంతమంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్దితి వారికి వేతనాలు మాత్రం ప్రతి నెల బ్యాంకుల్లో వేస్తున్నట్లు భద్రత విభాగానికి చెందిన అధికారులు వెల్లడిస్తున్నారు. బోర్డులో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిపై నిఘా పెడితే దొంగలు బయటపడుతారని డివిజన్ సిబ్బంది పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News