Wednesday, May 8, 2024

సింధుకు అభినందనలు

- Advertisement -
- Advertisement -

Congratulations to Badminton Sindhu

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధును రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్ ప్రచారంలో భాగంగా అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సిందు ఎంపికైన విషయం తెలిసిందే. అత్యంత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న సింధును శాట్స్ చైర్మన్ బుధవారం గచ్చిబౌలి బ్యాడ్మింటన్ స్టేడియంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లోనే అత్యంత ప్రతిభాంతులైన షట్లర్లలో ఒకరిగా సింధు పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు ముందుకు సాగాలని చైర్మన్ సూచించారు. మరోవైపు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు కూడా సింధును అభినందించారు. సింధుకు ఈ అవకాశం దక్కడం దేశానికే గర్వకారణం అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News