Monday, April 29, 2024

దుమ్మురేపుతున్న ‘లాహె లాహె’…

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మల కాంబోలో గతంలో వచ్చిన పలు సినిమాల మ్యూజిక్ ఆల్బమ్‌లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరు ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవితో చాలా కాలం తర్వాత మణిశర్మ చేస్తున్న సినిమా కావడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి పాట ‘లాహె లాహె…’ అదరగొట్టేస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం వచ్చిన లాహె లాహె సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఏకంగా 30 మిలియన్‌ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఈ పాట దూసుకు పోతోంది.

ఈమధ్య కాలంలో ‘సారంగ దరియా…’ సాంగ్ తర్వాత అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న పాటగా ‘లాహె లాహె…’ నిలిచింది. లాహె లాహె సాంగ్‌లో మెగాస్టార్ డ్యాన్స్ బిట్‌తో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత కాస్ట్యూమ్స్, డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాజల్ కూడా ఈ పాటలో కనిపించింది. ఈ పాట మేకింగ్ వీడియోలో టెంపుల్ సిటీ సెట్టింగ్ ను కొద్ది భాగం చూపించడం వల్ల పాట చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.

పాట లిరిక్స్ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. శివ పార్వతులకు సంబంధించిన ఈ పాట చాలా పెద్ద అర్థాన్ని తెలిపే విధంగా ఉందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా లాహె లాహె సాంగ్ అన్ని విధాలుగా బాగుండటంతో భారీ వ్యూస్‌ను దక్కించుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చిరు, చరణ్‌లు నక్సలైట్‌లుగా కనిపించబోతున్నారని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమాను వాయిదా వేయడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News