Monday, May 6, 2024

ఇంద్రసేనా రెడ్డికి అభినందనల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : త్రిపుర గవర్నర్‌గా నియమితులైన బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగింది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గురువారం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ రాష్ట్ర సలహాదారు సభ్యులు ఆంటోనీ రెడ్డితో వివిధ జిల్లాలకు చెందిన నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్రిపుర గవర్నర్‌గా నియామకం చేయడం పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గవర్నర్‌గా నియమించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. మలక్‌పేట ప్రజలకు ఈ గుర్తింపు దక్కుతుంది. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటా. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా‘ అని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చాకే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.

ఇంద్రసేనారెడ్డి వివరాలు..
నల్లు ఇంద్రాసేనారెడ్డి ఎబివిపి రాష్ట్ర కార్యదర్శిగా, నగర కార్యదర్శిగా ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా జైలుకు వెళ్లారు. జనతా పార్టీ రాష్ట్ర శాఖ యువ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, బిజెపి ఏర్పడిన తర్వాత యువమోర్చా తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా, యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బిజెపి రాష్ట్ర కోశాధికారిగా, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా, బిజెపి జాతీయ కార్యదర్శిగా, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రస్తుతం పని చేస్తున్నారు. 99 నుండి 2003 వరకు బిజెపి శాసనసభ పక్ష నాయకులుగా పనిచేశారు. 1983లో మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. నాదెళ్ల భాస్కర్ రావుపైన 1985లో పోటీ చేసి విజయం సాధించారు. 1999లో మరోసారి గెలువడం జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పుడు రాజ్‌నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో జాతీయ పార్టీగా తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకొని పార్లమెంట్‌లో బిల్లు పెడితే సమర్థిస్తామని ప్రకటించారు.

Indrasena Reddy 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News