Tuesday, April 30, 2024

బూటకపు ఉత్తరంపై సిద్దరామయ్య లబోదిబో

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన పేరిట ఓ బూటకపు లేఖ సోషల్ మీడియాలో సర్క్యూ లేట్ అవుతోందని, దానిని నమ్మొద్దని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రజలకు విన్నవించుకున్నారు. ‘ఇది ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ల పని’ అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘నా పేరిట మల్లికార్జున ఖర్గేకు రాసినట్లు ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. అది నేను రాసింది కాదు. కొందరు ఆకతాయిలు ఆ పని చేసి ఉంటారు. నా మీద కుట్ర జరుగుతోంది. నాకు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డి.కె. శివకుమార్ మధ్య వివాదం సృష్టించేందుకు ఈ బూటకపు ఉత్తరాన్ని సృష్టించారు’ అని సిద్దరామయ్య వీడియో సందేశంలో తెలిపారు.
సిద్దరామయ్య ఈ బూటకపు ఉత్తరంపై ఎన్నికల సంఘం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బూటకపు ఉత్తరం వెనుక ఎవరున్నారన్నది కనుగొనమని కూడా ఆయన విన్నవించుకున్నారు. రేపే 224 సీట్ల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News