Tuesday, April 30, 2024

ట్రంప్‌కు కరోనా నెగటివ్

- Advertisement -
- Advertisement -

Trump

 

వాషింగ్టన్: కరోనావైరస్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత వైట్‌హౌస్ డాక్టర్ ఈ సమాచారం తెలిపారు. 73 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్‌కు శుక్రవారం రాత్రి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. 24 గంటల లోగానే ఫలితాలు వచ్చాయి. ‘గత రాత్రి కోవిడ్ 19 పరీక్ష గురించి ప్రెసిడెంట్‌తో లోతుగా చర్చించిన తర్వాత ఆయన పరీక్షకు సిద్ధమయ్యారు. ఆ పరీక్షలో ఫలితం నెగటివ్ వచ్చిందని నిర్ధారిస్తూ ఈ సాయంకాలం సమాచారం అందింది’ అని అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ స్టెఫనీ గ్రిషామ్‌కు శనివారం ఇచ్చిన ఒక మెమొరాండంలో పేర్కొన్నారు. ‘బ్రెజిల్ ప్రతినిధి బృందంతో మార్ ఎ లాగోలో విందు స్వీకరించిన వారం రోజుల తర్వాత కూడా ప్రెసిడెంట్‌కు వ్యాధి లక్షణాలు కనిపించలేదు’ అన్నారాయన.‘సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్)ను, వైట్‌హౌస్ టాస్క్ ఫోర్స్‌ను నేను రోజూ సంప్రదిస్తున్నాను. ఈ వ్యాధి వ్యాపించకుండా అరికట్టేందుకు వారు తీసుకుంటున్న అన్ని చర్యల్నీ ప్రోత్సహిస్తున్నాం’ అని కోన్లే తెలిపారు.

దుబాయ్‌లో భారత జాతీయుడికి కరోనా పాజిటివ్
దుబాయ్ : విదేశాల్లో సెలవులు గడిపి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) చేరిన భారత జాతీయుడికి చేసిన కరోనా (కోవిడ్ 19) పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు మీడియా తెలిపింది. ఈ సమాచారాన్ని ఆరోగ్య వ్యాధి నిరోధక మంత్రిత్వశాఖ (ఎంఓహెచ్‌ఎపి)ధ్రువీకరించింది. ‘దేశంలో ఇప్పటికి 85 కరోనా కేసుల్లో పాజిటివ్ వచ్చింది. వివిధ సంస్థల సహకారంతో కరోనా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనలు పాటిస్తున్నాం. ప్రమాణాల్ని అనుసరిస్తున్నాం’ అని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రతివారు తమ ఆరోగ్యంపట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని, ఈ వ్యాధి వ్యాపించకుండా అదుపు చేసే సూచనలు పాటించాలని, పుకార్లకు దూరంగా ఉండాలని మంత్రిత్వశాఖ తెలిపిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. ఇలా ఉండగా ఒక భారతీయుడితో సహా కోవిడ్ 19 సోకిన ముగ్గురు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దాంతో ఇంతవరకు ఈ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 23కు చేరిందని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది.

ఇరాన్‌లో తాజాగా 113 కరోనా మరణాలు
టెహరాన్: దేశంలో కరోనా వల్ల తాజాగా 113 మంది మరణించారని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఒక్కరోజులో ఇరాన్‌లో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కోవిడ్ 19 (కరోనా) సోకి మరణించిన వారి సంఖ్య 774కి చేరింది. ప్రపంచంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడిన దేశాల్లో ఇరాన్ ఒకటి. ‘ప్రజలు అన్ని రకాల ప్రయాణాల్ని రద్దు చేసుకోవాలి. ఇంట్లోనే ఉండాలి. అలా చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందనుకుంటున్నాం’ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి కియానౌష్ జహాన్‌పోర్ ఒక టెలివిజన్ సమావేశంలో చెప్పారు.

Corona negative for Trump
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News