Friday, April 26, 2024

కరోనా టెస్టుకు సిసిఎంబి…. మోడీకి ఫోన్ చేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR

 

హైదరాబాద్: సిసిఎంబిలో కరోనా టెస్టులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ విజ్ఞప్తికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. సిసిఎంబిలో రోజుకు దాదాపు వెయ్యి మంది వరకు కరోనా టెస్టులు చేసే అవకాశం ఉంది. సిసిఎంబిలో వైరస్‌ను హ్యాండిల్ చేసే బయోసెఫ్టీ లెవెల్-3 సదుపాయం ఉంది. దీంతో గాంధీ ఆస్పత్రితో సహా పలు ఆస్పత్రులతో సిసిఎంబి టై అప్ అవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాథమిక టెస్టులను విజయవంతంగా సిసిఎంబి పూర్తి చేసింది. ఇప్పటికే భారత్ దేశంలో కరోనా వ్యాధి 1199 మందికి సోకగా 29 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్ 70 మందికి సోకగా ఒకరు మృతి చెందారు. ప్రపంచంలో కరోనా వైరస్ 7,35,833 మందికి సోకగా 34,847 మంది చనిపోయారు.

 

Corona test in CCMB… CM KCR asked to PM Modi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News