Saturday, April 27, 2024

25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Corona tests have crossed 25 lakhs in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆదివారం చేసిన 31,095 కలిపి మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,19,315 టెస్టులు చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కొత్తగా 1302 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 266 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 29, జగిత్యాల 34, జనగామ 18, భూపాలపల్లి 0, గద్వాల 18, కామారెడ్డి 14, కరీంనగర్ 102, ఖమ్మం 35, ఆసిఫాబాద్ 8,మహబూబ్‌నగర్ 24, మహబూబాబాద్ 45, మంచిర్యాల 20, మెదక్ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 24, ములుగు 15, నాగర్‌కర్నూల్ 37, నల్గొండ 70,నారాయణపేట్ 4, నిర్మల్ 13,నిజామాబాద్ 50, పెద్దపల్లి 20, సిరిసిల్లా 23, రంగారెడ్డి 98, సంగారెడ్డి 54, సిద్ధిపేట్ 92, సూర్యాపేట్ 26,వికారాబాద్ 10, వనపర్తి 25, వరంగల్ రూరల్ 18 ,వరంగల్ అర్బన్ లో 62, యాదాద్రిలో మరో 24 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,72,608కి చేరగా, ప్రస్తుతం 1,41,930 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 29,636 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 22,990 మంది ఐసొలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1042 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

బెడ్లన్నీ ఖాళీ….

రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనా బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. రోజురోజుకి రికవరీ అయ్యే వారి సంఖ్య పెరుగుతుండటంతో పడకలు ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లోనే వైరస్ తీవ్రత తగ్గి, హాస్పిటల్స్‌లో సాధారణ పరిస్థితి కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో5509, ప్రైవేట్‌లో 6993 బెడ్లు ఖాళీగా ఉన్నాయని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News