Saturday, April 27, 2024

సెప్టెంబర్ మధ్యలో కరోనా ఖతం?

- Advertisement -
- Advertisement -
Corona will be out by mid September

 

కేంద్ర ఆరోగ్య శాఖ సంకేతాలు
యాక్టివ్ కేసులు 1,33,532
రికవరీల సంఖ్య 1,35,205
వైరస్ నిష్క్రమణ దశ దరిదాపుల్లో

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెప్టెంబర్ మధ్యనాటికి అంతం అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంకేతాలు వెలువరించింది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసుల సంఖ్య పెరిగిందని, ఇది క్రమేపీ వైరస్ నిష్క్రమణకు దారితీసే పరిణామం అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ రోజువారి అధికారిక గణాంకాలు, వైరస్‌పై వివరణల నేపథ్యంలో తెలిపింది. సెప్టెంబర్ మధ్య నాటికి దేశంలో వైరస్ అంతం కావచ్చునని ఇందుకు బుధవారం నాటి పరిణామాలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్న వారి సంఖ్య (రికవరీలు) ఎక్కువగా ఉందని , ఇది అత్యంత శుభ పరిణామం అంతకు మించి వైరస్ కట్టడిలో కీలక అంశం అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు బుధవారం తెలిపారు.

వైరస్ బారిన పడిన వారి సంఖ్య లెక్కచూసుకుంటే, దీనిని వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఈ రెండు సమాన సంఖ్యకు చేరుకుంటే అది వైరస్ నిష్క్రమణకు నిష్క్రమణ దశ అవుతుందని , ప్రస్తుత స్థితి కొనసాగితే వచ్చే రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ మధ్యలో దేశానికి వైరస్ బెడద తొలుగుతుందని అంచనా వేశారు.రెండు మూడు రోజుల క్రితమే గణితశాస్త్ర పద్ధతి విశ్లేషణల మేరకు వైరస్ సెప్టెంబర్ మధ్యలో వైరస్ వీడుతుందని తేల్చారు. బైలీ సాక్షేప తొలిగింపు రేట్ (బిఎంఆర్‌ఆర్) పద్ధతిలో వైరస్ అంతం అవుతుందని తెలిపిన ఆరోగ్య శాఖ ఇప్పుడు రికవరీలు, యాక్టివ్ కేసుల గణాంకాలను పొందుపర్చి, త్వరలో వైరస్ అంతం అవుతుందని సూచనలు వెలువరించిందిం. ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు రికవరీల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్యను దాటింది. ఇప్పుడు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాల మేరకు తొలిసారిగా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది.

ఈ సంఖ్య ఇప్పుడు దేశంలో 1,33,532 ఉంది, ఇక రికవరీ కేసుల సంఖ్య 1,35,205 వరకూ నమోదైంది. దీనితో రికవరీ శాతం 48.99 శాతానికి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే వరుసగా ఆరోరోజు కూడా ఇండియాలో 24 గంటల వ్యవధిలో వైరస్ సోకిన వారి సంఖ్య 9500కు పైగా నమోదు అయింది. ఇక ఒక్కరోజు మృతుల సంఖ్య 279గా నిలిచింది. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 7745 అయింది.ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత దేశాల జాబితాలో ఇండియాది ఐదో స్థానం అయింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తరువాతి స్థానంలో భారతదేశం చేరింది. దేశంలో వరుసగా మరోరోజు కూడా మహారాష్ట్రలోనే అత్యధిక సంఖ్యలో 120 మంది కరోనాతో మృతి చెందారు. 33 మంది గుజరాత్‌లో చనిపోగా, తరువాతి స్థానంలో ఢిల్లీలో 31 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ మొత్తం 3289 మృతి చెందారు. తరువాతి స్థానంలో గుజరాత్‌లో 1313 మంది, ఢిల్లీలో 905 మంది మృతి చెందారు. దేశంలో బుధవారం నాటికి వైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం మీద 2,76,583కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News