Thursday, May 2, 2024

అంబేద్కర్ కలలు కన్న దేశం ఇంకా రాలేదు: మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

country that Ambedkar dreamed of has not yet arrived

హైదరాబాద్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 72 ఏళ్లల్లో అనేక మార్పులు జరిగాయి కానీ, రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహేబ్ అంబేద్కర్ కలలు కన్న దేశం ఇంకా రాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పేదరికం పెనుసమస్యగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగాక సమాజంలో స్చేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవన్నారు. ముఖ్యంగా మహిళలపై ఇప్పటికీ దాడులు జరగడం బాధకరమన్నారు. ఈ రిపబ్లిక్ డే సందర్బంగా సమాజంలో పేదరికం అంతమై స్వేచ్ఛతో కూడిన గొప్ప ప్రజాస్వామిక దేశం కావాలని కోరుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈసందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…దేశ ప్రజలందరికీ 72వ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డా బాబాసాహేబ్ అందేద్కర్ అని కొనియాడారు. ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తేనే దేశంలో అంతరాలు అంతం అవుతాయన్నారు. కుల, మత రహితాలు తొలగిపోయి లౌకిక రాజ్యాలు రావాలన్నారు. దీని కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యావేత్తలు, కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు కంకణం కట్టుకొని పనిచేయాలన్నారు. సమాజాన్ని చైతన్యం చేసి మంచి మార్గాలను సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

country that Ambedkar dreamed of has not yet arrived

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News