Friday, April 26, 2024

కోవాగ్జిన్ ధర తగ్గించలేం: భారత్ బయోటెక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై భారత్ బయెటెక్ ప్రకటన విఢుదల చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. నష్టాలు కలిగినా కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని చెప్పింది. కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని.. అయితే, ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువే ప్రైవేట్ రంగానికి ఇస్తున్నామని, ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది.

Covaxin price cannot be reduced: Bharat Biotech

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News