Saturday, May 4, 2024

కొవిడ్ వ్యాధిగ్రస్థుల శరీర భాగాల్లో వేర్వేరు వేరియంట్లు దాగున్నాయి!

- Advertisement -
- Advertisement -
Covid-19 infected people may have different variants
తాజా అధ్యయనంలో వెల్లడి

లండన్: కొవిడ్19తో బాధపడుతున్న వారి శరీర భాగాల్లో సార్స్‌సిఒవి2కు చెందిన వివిధ వేరియంట్లు(రూపాంతరాలు) దాగున్నాయని ఇటీవల జరిపిన రెండు అధ్యయనాల్లో వెల్లడయింది. ఆ వేరియంట్లు రోగ నిరోధక వ్యవస్థకు దూరంగా దాగి ఉన్నాయని కూడా ఆ అధ్యయనాలు వెల్లడించాయి. యూకెలోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఈ రెండు అధ్యయనాలు చేపట్టాయి. కొవిడ్19 సోకిన వ్యక్తి నుంచి ఈ దాగి ఉన్న వివిధ వేరియంట్లను తొలగించడం అంత సులభం కూడా కాదని ఆ రెండు అధ్యయన సంస్థలు వెల్లడించాయి. వాటి అధ్యయనాలను ‘నేచర్ కమ్యూనికేషన్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. పరిశోధకులు సార్స్‌సిఒవి2 స్పైక్ ప్రొటీన్‌పై పరిశోధన చేశారు. వారు వైరస్ ఇన్‌ఫెక్షన్ వలయంపై ఈ పరిశోధన చేశారు.

స్పైక్ ప్రొటీన్‌లో ఉన్న పాకెట్‌లో ఉండే వైరస్ కణాలలోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్ట్ చేస్తుందన్నారు. వైరస్ సోకడానికి ఇదే ప్రధాన భూమికను నిర్వహిస్తుందన్నారు. ‘మునుపటి కొవిడ్ వేరియంట్ల స్థానంలో ఇప్పుడు ఒమిక్రాన్, ఒమిక్రాన్2 తిష్ట వేశాయి’ అని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన ప్రొఫెసర్ ఇమ్రే బెర్గెర్ తెలిపారు. ‘మేము ఇదివరకటి ‘బ్రిస్ డెల్టా’ వేరియంట్‌ను బ్రిస్టల్‌లో గుర్తించాము. ఒరిజినల్ వైరస్ తన రూపును మార్చుకుంది. కానీ మేము కనుగొన్న పాకెట్ మాత్రం ఎలాంటి మార్పు చెందక యథవిధిగా ఉంది’ అని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ‘మా పరిశోధన ఫలితాలు ఒకరిలో అనేక వైరస్ వేరియంట్లు ఉండొచ్చని తేల్చింది’ అని బ్రిస్ డెల్టా అధ్యయనంలో ముఖ్య రచయితగా ఉన్న కపిల్ గుప్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News