Friday, April 26, 2024

కొవిడ్ 19 పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Covid-19 lockdown in Wuhan

బీజింగ్ : యావత్ ప్రపంచాన్ని సంక్షోభం లోకి నెట్టిన కొవిడ్ 19 మహమ్మారి, మొట్టమొదటగా చైనా లోని వుహాన్‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. మళ్లీ అక్కడ కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో వుహాన్ లోని పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్ లోని హన్‌యాంగ్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకు ఉంటాయని, పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు. వుహాన్‌లో 10 లక్షల జనాభా కలిగిన జియాంగ్‌షియా జిల్లాలో ఇటీవల లాక్‌డౌన్ విధించారు. షాషి ప్రావిన్సు లోని డాటొంగ్ నగరంతోపాటు గువాంగ్‌ఝువా లోనూ కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా హన్‌యాంగ్‌లో లాక్‌డౌన్ అమలు లోకి తెచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News