Friday, May 3, 2024

లాలాజలంతో కొవిడ్ నిర్ధారణ

- Advertisement -
- Advertisement -

సలైవా టెస్టు పద్ధతిలో శాంపిల్ సేకరణ అమెరికా
ఎఫ్‌డిఎ అనుమతి

Covid diagnosis test with saliva

హోస్టన్: కరోనా వైరస్ మహమ్మారిని త్వరగా గుర్తించడానికి లాలాజలంతో నిర్ధారించే కొత్త విధానానికి అమెరికా ఎఫ్‌డిఎ అనుమతినిచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం సలైవా టెస్ట్ పద్ధతిలో నోటి నుంచి లాలాజలాన్ని తీసుకుని పరీక్షిస్తారు. దీనివల్ల వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతోపాటు పరీక్షల్లో కీలకమైన రీఏజెంట్ల లోటును భర్తీ చేయవచ్చని ఎఫ్‌డిఎ కమిషనర్ స్టీఫెన్‌హాన్ వివరించారు. ఇప్పటికే లాలాజలంతో పరీక్షించే నాలుగు రకాల పద్ధతులకు ఎఫ్‌డిఎ అనుమతి ఇచ్చింది. వీటి ఫలితాల్లో తేడాలున్నట్టు బయటపడింది. అందువల్ల ఈ కొత్త విధానంతో స్వాబ్ పరీక్షలకు సమాన ఫలితాలు ఉన్నట్టు గుర్తించామని ఎఫ్‌డిఎ వివరించింది. ఈ సలైవాడైరెక్టు విధానాన్ని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు అభివృద్ధి చేశారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) క్రీడాకారులు, సిబ్బందికి సంబంధించిన కార్యక్రమం ద్వారా ఎసింప్టమేటిక్ లక్షణాలున్న వ్యక్తులపై ఈ సలైవాడైరెక్టు విధానాన్ని పరీక్షించి చూశారు. వచ్చే కొన్ని వారాల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను అందుబాటు లోకి తెస్తారు. వైరస్ నిర్ధారణలో ఈ విధానం గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశాలున్నాయని పరిశోధకులు నాదాన్ గ్రూబౌగ్, అన్నేవైల్లీ పేర్కొన్నారు. మిగతా విధానాలతో పోల్చితే దీనికి ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షను తాము సరళం చేశామని, రీఏజెంట్లకు రెండు డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుందని, దీనివల్ల ప్రతి పరీక్షకు లేబొరేటరీలు 10 డాలర్లు కన్నా ఎక్కువ వసూలు చేయవని అంచనా వేస్తున్నట్టు వివరించారు.ఈ సలైవా డైరెక్టు విధానం అందుబాటు లోకి వస్తే వ్యాక్సిన్ కన్నా వేగంగా కరోనాను నియంత్రించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

ఈ సలైవా డైరెక్టు విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు వివరించారు. శాంపిల్ తీసుకోవడం సురక్షితం, తక్కువ హాని ఉంటుంది. ఆరోగ్యసిబ్బందికి స్వల్పశిక్షణ ఇస్తే సరిపోతుంది. శాంపిల్ సేకరించే సమయంలో తక్కువ ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించేటప్పుడు తుమ్ము, దగ్గు వల్ల వైరస్ బయటకు విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త విధానంలో అలాంటి ప్రమాదం ఉండదు. శాంపిళ్లను కనీస ఉష్ణోగ్రతలో, ప్రత్యేకంగా భద్రపరిచే అవసరం ఉండదు. స్వాబ్ పద్ధతితో దీన్ని పోల్చితే ఇందులో ఖర్చు తక్కువ కావడమే కాక, 90 శాతం కచ్చితమైన ఫలితం ఉంటుంది. కొవిడ్ 19 నిర్ధారణకు ప్రపంచ వ్యాప్తంగా స్వాబ్ పద్ధతినే ఎక్కువ శాతం వినియోగిస్తుండగా, భారత్ తదితర దేశాల్లో మాత్రం ఆర్‌టిపిసిఆర్‌తోపాటు ట్రూనాట్, సీబీనాట్ విధానాలు ఉపయోగిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద రోజుకు నాలుగు మిలియన్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉండగా, ఆమేరకు లక్షాన్ని సాధించడానికి సలైవా డైరెక్టు టెస్ట్ ఒక మార్గం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంతో తమ ప్రయోగశాల పరీక్ష సామర్థం రెట్టింపు అవుతుందని యేలె పాథాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చెన్‌లియూ ఆశాభావం వెలిబుచ్చారు.

Covid diagnosis test with saliva

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News