Friday, May 3, 2024

కొవిడ్ బాధితులైన తల్లులు బిడ్డలకు పాలందించ వచ్చు

- Advertisement -
- Advertisement -

Covid-positive Mothers Should Continue Breastfeeding their children

తరువాత ఆరడుగుల దూరంలో బిడ్డలనుంచాలి
న్యూఢిల్లీ వైద్యనిపుణురాలు డాక్టర్ మంజుపూరి సూచనలు

న్యూఢిల్లీ :కొవిడ్ పాజిటివ్ బాధితులైన తల్లులు తమ పసికందులకు పాలివ్వడం కొనసాగించ వచ్చని, అయితే పాలిచ్చే సమయం తప్ప మిగతా సమయంలో తప్పనిసరిగా ఆరడుగుల దూరంలో తమ బిడ్డలను ఉంచవలసి వస్తుందని సీనియర్ డాక్టర్ మంజుపూరి సూచించారు. న్యూఢిల్లీ లేడీ హార్డింగె మెడికల్ కాలేజీ అబ్సెటెట్రిక్స్, గైనకాలజీ విభాగం అధిపతిగా ముంజుపూరి పనిచేస్తున్నారు. తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కొవిడ్ 19 సంక్రమిస్తుందనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కానీ గర్భిణులు తమ బిడ్డకు కరోనా నుంచి రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

టీకాలు వేయించుకోడానికి గర్భిణులు వెనుకాడడాన్ని ఉద్దేశిస్తూ జననేంద్రియాలపై కానీ సంతానంపై కానీ టీకాలు వ్యతిరేక ప్రభావం ఏవీ చూపించబోవని చెప్పారు. ఎవరైతే సంరక్షకులకు కొవిడ్ నెగిటివ్ వచ్చిందో వారు కూడా కొత్తగా పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వవచ్చని చెప్పారు. అయితే బిడ్డను పాలచేర్పు చేసేముందు పాలిచ్చే తల్లులు తమ చేతులను శుభ్రపర్చుకోవాలని, మాస్కులు, ఫేస్‌షీల్డులు ధరించాలని, తమ పరిసరాలను కూడా తరచుగా శానిటైజ్ చేయాలని సూచించారు.

అలాగే తల్లీ బిడ్డ వెంటిలేషన్ బాగా ఉన్న గదిలో ఉండాలని, బిడ్డకు వీలైనంత దూరం లో ఉండాలని తెలిపారు. గర్భస్థ శిశువుకు వైరస్ సంక్రమించే అవకాశంపై నిర్వహించిన అధ్యయనాలను వివరించారు. తల్లి గర్బాశయంలో ఏర్పడే మావిలో బిడ్డ పెరుగుతుందని, అదే బిడ్డకు రక్షణ కవచంగా పనిచేస్తుందని వివరించారు. నవజాత శిశువులు కొందరికి కరోనా సోకిన కేసులు కొన్ని ఉన్నప్పటికీ శిశువులు తల్లి గర్భంలోనే వైరస్‌కు గురయ్యారని, లేదా పుట్టగానే వైరస్ బాధితులయ్యారని నిర్ధారించడానికి ఆధారాలు ఏవీ కనిపించలేదని పేర్కొన్నారు.

కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే కరోనా సెకండ్ వేవ్ లో గర్భిణులు ఎక్కువగా కరోనా వైరస్‌కు గురయ్యారని, అయితే గర్భిణుల్లో తీవ్ర పరిణామాలు ఏర్పడకుండా వ్యాక్సిన్ నివారించిన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. తల్లిపాలు ఇచ్చేటప్పుడు తల్లిపాల ద్వారా యాంటీబాడీలను బిడ్డ పొందగలుగుతారని పేర్కొన్నారు. వాస్తవానికి గర్భిణులకు వారి పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పించడానికి సాధారణంగా హెపటైటిస్ బి, ఇన్‌ఫ్లుయెంజా, పెర్టుసిస్ వంటి కొన్ని వ్యాక్సిన్లు ఇస్తుంటామని, ఇదికాక గర్భిణులు తమ భద్రత విషయంలో నమ్మకంగా ఉంటే వ్యాక్సిన్లు ఇవ్వవచ్చని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News