Tuesday, May 7, 2024

థ్రిల్ ఫీలవుతారు

- Advertisement -
- Advertisement -

Ishq Movie Unit Press Meet in Hyderabad

తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్.రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “ఈనెల 30న థియేటర్లలో విడుదలవుతున్న ‘ఇష్క్’ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు తప్పకుండా మాస్కులు ధరించి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు యస్.యస్.రాజు మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న ‘తిమ్మరసు’ చిత్రం కొత్త కథతో రూపుదిద్దుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్, నిర్మాత వాకాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Ishq Movie Unit Press Meet in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News