Sunday, April 28, 2024

కొత్త వేరియంట్లనూ ఎదుర్కొనే టీకాలు

- Advertisement -
- Advertisement -
covid vaccine against new variants
అమెరికా శాస్త్రవేత్తల సన్నాహాలు

బోస్టన్ : కరోనా మహమ్మారిని మరింత కట్టడి చేయగల టీకాను తయారు చేయడానికి తగిన ఫార్ములాను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా వేగంగా పుట్టుకొస్తున్న వివిధ వేరియంట్లను ఈ టీకా ఎదుర్కోగలదని చెప్పారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమయ్యే తీరు ఆధారంగా బోస్టన్ యూనివర్శిటీ, హార్వర్డ్ వర్శిటీ లోని బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ చేశారు. ప్రస్తుత కరోనా టీకాలు రోగ నిరోధక వ్యవస్థ లోని బి కణాలను, క్రియాశీలం చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. యాంటీబాడీలను సృష్టించడం, ఈ కణాల బాధ్యత. రోగ నిరోధక వ్యవస్థ లోని టీ కణాలను ప్రేరేపించే వ్యాక్సిన్ల వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

దీనివల్ల కరోనా, దానికి సంబంధించిన కొత్త వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని తేల్చారు. ఈ నేపథ్యంలో టీ కణాల క్రియాశీలానికి కారణమయ్యే కరోనా భాగాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మానవ కణాల్లో కరోనా ఉత్పత్తి చేసే 29 రకాల ప్రొటీన్ల గురించి ఇప్పటికే వారికి అవగాహన ఉంది. వైరస్ జన్యుక్రమంలో దాగున్న మరో 23 ప్రొటీన్లను ఆ తరువాత గుర్తించారు. వైరస్‌పై దాడి చేయడానికి అవసరమైన సంకేతాల్లో చాలా భాగం ఈ ప్రొటీన్ల నుంచే మానవ రోగ నిరోధక వ్యవస్థకు అందుతున్నట్టు తాజాగా తేల్చారు.

covid vaccine against new variants

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News