Friday, April 26, 2024

గోల్కొండ మర్డర్ మిస్టరీ వీడింది

- Advertisement -
- Advertisement -

cp anjani kumar press meet on golconda murder case

అజిఅలీని స్నేహితులే హత్య చేశారు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. తను ఆటో కొనుగోలు చేసేందుకు ష్యూరిటీ సంతకం పెట్టలేదని ఆగ్రహంతో హత్య చేశాడు నిందితుడు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని గోల్కొండ, రిసాలాబజార్‌కు చెందిన ఎండి అజ్జు అలీ(21) ఆటోట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహ్మద్ ఇర్ఫాన్ ఆటోట్రాలీ డ్రైవర్ ఇద్దరు స్నేహితులు. ఈ నెల 11వ తేదీన అనుమానస్పదస్థితిలో బావిలో మృతిచెంది ఉన్నాడు. ఇద్దరు ఆటోట్రాలీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కానీ మహ్మద్ ఇర్ఫాన్‌కు వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. తను సొంతంగా ఆటో తీసుకునేందుకు ష్యూరిటీ సంతకం పెట్టాలని అజ్జుఅలీని కోరాడు. దానికి అజ్జుఅలీ నిరాకరించాడు, అంతేకాకుండా ఇర్ఫాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. అంతేకాకుండా అజ్జుఅలీ ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చాలా సార్లు అజ్జును ఆమె ఇంటి వద్ద దింపేవాడు.

సదరు మహిళ తనతో గడిపేందుకు సహకరించాలని కోరాడు. దానికి అజ్జు, ఇర్ఫాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి గొడవపెట్టుకున్నాడు. దీనిని మనసులో పెట్టుకున్న నిందితుడు అజ్జుఅలీని ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4.30గంటలకు బావిలో ఈత కొట్టేందుకు గోల్కొడలోని కుతుబ్‌షాహి మసీద్, అట్టారాసాదికి తీసుకుని వెళ్లాడు. నిందితుడు బావిలో ఈత కొట్టుతుండగా అజ్జుఅలీ మెట్లపై ఉన్నాడు. లోపలికి రావాల్సిందిగా కోరినా రాలేదు, దీంతో ఇర్ఫాన్ లోపలికి నెట్టివేశాడు. లోపలికి వెళ్లిన తర్వాత అజ్జును నీటిలో ముంచి చంపివేశాడు. అందులో ఈతకొడుతున్న వారిని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడని నమ్మించి బయటికి వెళ్లాడు. 11వ తేదీన బావిలో గుర్తుతెలియాని యువకుడి మృతదేహం తేలి ఉండడంతో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో డిఐ మట్టం రాజు, ఎస్సై మహేందర్ రెడ్డి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News