Wednesday, May 1, 2024

కారులోనే కీచకం

- Advertisement -
- Advertisement -

పక్కా పథకం ప్రకారమే జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్
వీడియోలు తీసింది నిందితులే
నిందితుల్లో ఎ-1 సాదుద్దీన్‌తోపాటు ఐదుగురు మైనర్లు
అందరికీ కఠిన శిక్షలు పడేలా ఆయా సెక్షన్ల ప్రకారం కేసులు
ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేదిలేదు
ఎవరి వత్తిళ్లకు పోలీసులు తలొగ్గలేదు
మీడియా భేటీలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో సమగ్రంగా దర్యాప్తు చేశామని, ఎవరినీ ఉపేక్షించలేదని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం నాడు సిపి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ కేసులో మైనర్లు ఉన్నందున వారి పేర్లను ఎక్కడా వెల్లడించేందుకు వీల్లేదన్నా రు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిలో ఒకరు మేజర్ కాగా మిగతా ఐదుగురు మైనర్లు ఉన్నారని వివరించారు. అమ్మీషియా పబ్ కేసులో ఎంఎల్‌ఎ కుమారుడితో పాటు మొత్తం 6 గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. అయితే ఇందులో నిందితుడు సాదుద్దీన్ మేజర్ కాగా మిగిలిన 5 మంది మైనర్లు కావడంతో వారి పేర్లు వెల్లండించే అధికారం లేదన్నారు. మే 28న అత్యాచార ఘటన జరగగా మే 31వ తేదీన విషయం బయటికి వచ్చిందన్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమో దు చేసి బాధితురాలికి భరోసా సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇచ్చి స్టేట్‌మెం ట్ రికార్డు చేశారన్నారు.

అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో భాగంగా పబ్ తో పాటు బేకరీ వద్ద సిసి కెమెరాల పుట్టేజిలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జూన్ 3న ఒక నిందుతుడిని అరెస్టు చేయగా, 4వ తేదీన మరో 4గురిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో 6వ నిందితుడిని సైతం అరెస్టు చేసినట్లు నగర సిపి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూరైందని తెలిపారు. ఈ వ్యవహారం అంతా మార్చి 28న మొదలైందని, బెంగళూరులో నివసించే ఓ విద్యార్థి పాఠశాలలు ప్రారంభానికి ముందు పార్టీ ఏర్పాటు చేయాలని భావించాడన్నారు. అందుకోసం తన ముగ్గురు స్నేహితులను సంప్రదించి నగరంలోని ఏ పబ్‌లో పార్టీ ఇస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించాడు. మరో ముగ్గురు విద్యార్థులు వివరాలు సేకరించి అమ్నేసియా పబ్ అయితే బాగుంటుందని తెలియజేయడంతో పార్టీ ఏర్పాటు విషయమై ఒక మైనర్ ఇన్‌స్ట్టాగ్రామ్‌లో పార్టీ ఉన్నట్లు పోస్టు పెట్టాడన్నారు. నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీ కోసం వీరంతా పబ్ బుక్ చేశారని, వీరంతా మైనర్లు కావడంతో వారి మరో స్నేహితుడు మేజర్ అయిన ఉస్మాన్ అలీఖాన్ ద్వారా పబ్ బుక్ చేయించారన్నారు.

ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.1200ల చొప్పున ఉండే టికెట్‌ను రూ.900 ప్రకారం పబ్ నిర్వహకులతో ఒప్పదం చేసుకున్నారన్నారు. మే 28న పార్టీ చేసుకుందామని మరోసారి ఇన్‌స్టాలో పోస్టు పెట్టారని , పార్టీ డేట్ ఫిక్స్ అయ్యాక ఇతర స్నేహితుల నుంచి మంచి స్పందన వచ్చింది. రూ.1200 టికెట్ను బేరమాడి రూ.900కు తగ్గించిన విషయాన్ని ఇతరులకు చెప్పకుండా అందరి నుంచి రావడంతో అందరి నుంచి రూ.1200 ప్రకారం వసూలు చేశారన్నారు. మే 25వ తేదీన ఆ అబ్బాయి బెంగళూరు నుంచి హైదరాబాద్ రాగానే అందరూ కలిసి పబ్‌లో రూ.1,00,000 అడ్వాన్స్ ఇచ్చారని, అయితే తన స్నేహితుల ద్వారా బాధితురాలు సైతం ఒక టికెట్ కొనుగోలు చేసిందని వివరించారు.

పబ్‌లో ఇది జరిగింది 
మే 28న పార్టీ జరిగిన రోజు మధ్యాహ్నం 1.10 గంటలకు బాలిక, ఆమెతో వచ్చిన బాలుడు పబ్ లోకి వెళ్లారు. 1.50 గంటల వరకు డ్యాన్స్ చేస్తూ అక్కడే గడిపారు. ఆ తర్వాత అతను వేరే పని మీద వెళ్లిపోయాడు. మరో స్నేహితురాలితో బాధితురాలు అక్కడే గడిపింది. 3.15 గంటలకు నిందితుల్లో ఒకరు బాలికతో మాటలు కలిపారు. ఆ తర్వాత మరో నిందితుడు సాదుద్దీన్ బాలికతో మాటలు కలిపాడు. వీరిద్దరూ కలిసి బాలికతో అసభ్యంగా వ్యవహరించారు. అయితే 5.10 తర్వాత ఇంకాస్త అసభ్యంగా ప్రవర్తించారు. 5.40కి బాలిక, ఆమె స్నేహితురాలు పరిస్థితిని గమనించి పబ్ నుంచి బయటకు వచ్చేశారు. వారు బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించడం మిగతా నిందితులు గమనించారు. అత్యాచారం చేయాలనే ఆలోచన కూడా అదే సమయంలో వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లూ ఈ బాలికలను ఫాలో అయ్యారు. బాలికతో ఉన్న అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత నిందితులు బాలికతో మాటలు కలిపి ట్రాప్ చేశారు.

ఆ తర్వాత సాదుద్దీన్తో పాటు ముగ్గురు మైనర్లు, బాలిక మెర్సిడెస్ బెంజ్ వెళ్లారు. అక్కడ నుంచి బెకరీకి వెళ్లారు. కారులో తిప్పుతూనే బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు.రోడ్ నంబర్ 44 వద్ద ఎక్కవ జన సంచారం లేని స్థలానికి వెళ్లి వాహనాన్ని ఆపేశారు. అక్కడ ఒక మైనర్ బాలికను రేప్ చేశాడు. ఆ తర్వాత కారును తిప్పుతూ మిగతావారు కూడా రేప్ చేశారు. ఈ క్రమంలో బాధితురాలి మెడ, శరీరంపై గాయాలయ్యాయి. అత్యాచారం తర్వాత బాలికను పబ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. రాత్రి 7.50గంటలకు బాలిక ఫోన్ చేయడంతో ఆమె తండ్రి పబ్ వద్దకు తీసుకెళ్లారు. 28న బాధితురాలిపై అత్యాచారం జరిగినప్పటికీ బాధితురాలు తల్లిదండ్రులకు, పోలీసులకు చెప్పలేదు. భరోసా కేంద్రంలో బాధితురాలికి ధైర్యం చెప్పడంతో వివరాలు చెప్పింది. అప్పటికే 3 రోజులు దాటిపోయింది. మూడు రోజుల తర్వాత బాలిక మెడపై ఉన్న గాయాలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని సిపి తెలిపారు.

వాళ్లే వీడియోలు తీశారు 

ఈ కేసులోని నిందితులే వీడియోలు తీసి సోషల్ మీడియాలో సర్కూలేట్ చేశారని అదే రోజు సాయంత్రం 5.54 తర్వాత బెంజ్ నుంచి దిగి బాలిక ఇన్నోవాలోకి వెళ్లింది. 5.57కి రెండు వాహనాలను పార్కు చేశారు. 6.15కి ఇన్నోవా బెకరీ నుంచి వెళ్లిపోయింది. దాంట్లో ఏ1 సాదుద్దీన్ మాలిక్, ఐదురుగు మైనర్లు, బాలిక ఇన్నోవాలో వెళ్లారు. 6.18కి ఈబాలికలను ఫాలో అయ్యారు. బాలికతో ఉన్న అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత నిందితులు బాలికతో మాటలు కలిపి ట్రాప్ చేశారని వివరించారు.

సామూహిక అత్యాచారం కేసు 

ఈనెల ఒకటో తేదీన జూబ్లీహిల్స్ ఘటనపై సామూహిక అత్యాచారం కేసు నమోదుచేశామని సిపి తెలిపారు. ఈక్రమంలో 3వ తేదీ సాదుద్దీన్‌ను అరెస్టు చేశామని, సాదుద్దీన్‌తో పాటు నలుగురు మైనర్లు బాధితురాలిపై అత్యాచారం చేశారన్నారు. ఐదో మైనర్ అత్యాచారం చేయలేదని, అయితే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. దీంతో అతనిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. అమ్నేసియా పబ్‌పై అబ్కారీ శాఖకు నివేదిక ఇచ్చామని సిపి సివి ఆనంద్ తెలిపారు.

ఎవరినీ తప్పించే ఉద్దేశ్యం లేదు 

ఈ కేసులో బలమైన ఆధారాల సేకరణ వల్లే కొంత ఆలస్యమైండని, కేసు నుంచి ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదని సిపి వివరించారు. పబ్‌ల నిర్వహణకు పోలీసు లైసెన్స్ అవసరం లేకుండా పోయిందని, ఇకపై పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే పబ్‌లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవితఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని సిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News