Sunday, April 28, 2024

మా మద్దతు టిఆర్ఎస్ కే: తమ్మినేని వీరభద్రం

- Advertisement -
- Advertisement -

CPM support to Tammineni veerabhadram in Munugode by election

హైదరాబాద్: బిజెపి ఓడగోట్టడానికే టిఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలలో తమకే మద్దతు చేయాలని అన్ని పార్టీలు కోరాయని, కానీ తమ కార్యకర్తలతో మాట్లాడిన తరువాత టిఆర్ఎస్ కే మద్దతు తెలిపామన్నారు. అభివృద్ది కోసమే రాజీనామా చేశానని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం కేవలం సాకు మాత్రమేనన్నారు. రాజ్ గోపాల్ ఎందుకు రాజీనామా చేశాడో అమిత్ షా క్లియర్ గా చెప్పారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొంటుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ గా ఉండబోతోందని, దీన్ని బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ గా మార్చబోతున్నారని విరుచుకపడ్డారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా మూడో స్థానానికి పోతుందని, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాల కష్టపడుతున్నారని, ఆయన అధ్యక్షుడు అయ్యాక పార్టీలో వేగం పెరిగిందన్నారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ మాకు ప్రధాన శత్రువు బిజెపి అని, కెసిఆర్ అప్రజాస్వామిక పద్ధతుల వల్ల కొందరు బిజెిపికి మద్దతు తెలుపుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అది చాల ప్రమాదకరమైన విషయమన్నారు. మునుగోడులో మాకు పట్టున్నా బిజెపిని ఓడగొట్టే శక్తి లేదని, మునుగోడు విషయంలో సిపిఎం లైన్ కి సిపిఐ లైన్ కి కొంత తేడా ఉందని,  టిఆర్ఎస్ కే తమ మద్దతు మునుగోడు వరకే ఉంటుందన్నారు. భవిష్యత్తులో టిఆర్ఎస్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి తమ మద్దతు ప్రస్తుతానికి కేవలం మునుగోడు వరకే పరిమితం చేశామన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులని కలిసిపోదామన్న సిఎం కెసిఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎన్నికల తర్వాత కూటమి కట్టడం ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందే తప్పా ఇప్పుడే కూటమి కట్టడం సరైంది కాదన్నారు. మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కెసిఆర్ తో చర్చిస్తామన్నారు. కృష్ణయ్య హత్య విషయానికి మునుగోడులో టిఆర్ఎస్ మద్దతుకు సంబంధం లేదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పాలని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News