Saturday, April 27, 2024

కమల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Indian-2

చెన్నై : కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 మూవీ షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై సమీపంలోని పూందమల్లి వద్దగల ఈవీపీ ఫిలింసిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ దర్మకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో శంకర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. భారతీయుడు -2 సినిమా సెట్స్ లో ప్రమాద ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ స్పందించింది. ముగ్గురు ప్రతిభావంతులైన వర్కర్స్ ని కోల్పోయాం. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Crane Accident on Set of Kamal Haasan Bharateeyudu 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News