Saturday, April 27, 2024

నేర ఛేదన కంటే.. నేర నివారణ ఉత్తమం

- Advertisement -
- Advertisement -

సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర

Police arrested a selling of drugs gang
మనతెలంగాణ/హైదరాబాద్: నేరాల ఛేదన కంటే నేర నివారణ దిశగా పోలీసులు పనిచేయాలని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో బుధవారం నాడు సిపి స్టీఫెన్ రవీంద్ర నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు , పరిశోధనలోనూ సాంకేతిక పరిజ్ఙానం ఆయుధంగా పోలీసులు ఉపయోగించుకోవాలని, నేరాలు జరిగాక స్పందన కంటే నివారణకు అప్రమత్తంగా ఉండాలన్నారు.

నేరాలు అధికంగా నమోదవుతున్న పోలీస్ స్టేషన్లలో రానున్న రోజుల్లో నేరాలను తగ్గించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసి క్రైమ్ రేట్ తగ్గించాలని ఆదేశించారు. నేర పరిశోధన, నియంత్రణలో కీలకమైన సిసిఎస్ , ఎసిపి, డిఐ,డిఎస్‌ఐ, ఇన్వెస్టిగేషన్ అధికారులకు ందన నేర నిర్దరణలో అనుసరించాల్సిన మార్గాలపై సిపి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్, పగలు, రాత్రి జరిగే దొంగతనాలు, ఆటోమొబైల్ చోరీలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలను అరికట్టేందుకు, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలన్నారు. నేరం జరిగిన వెంటనే అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవటం ద్వారా నేరస్తులను తేలికగా పట్టుకోవచ్చని సూచించారు. నేర పరిశోధన, దర్యాప్తులో ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉండాలన్నారు. నేరస్తులను పట్టుకోవటమే కాదు సరైన ఆధారాలతో నేరస్తులకు శిక్షలు పడేలా సరైన సమయంలో ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు.

యూఐ కేసులు, పెండింగ్, మహిళలపై నేరాల, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై పోలీస్ స్టేషన్ వారీగా ఆరా తీశారు. కేసుల దర్యాప్తు, రికవరీ తక్కువగా ఉన్న పోలీస్టేషన్‌లలో సమస్యలను విశ్లేషించారు. లోపాలను సరిదిద్దుకొని వేగవంతంగా కేసుల దర్యాప్తు పూర్తిచేయటం, సొమ్ము రికవరీ చేపట్టడంపై అనుసరించాల్సిన పద్దతులపై పోలీసులకు సిపి పలు సూచనలు చేశారు. కీలక కేసులలో దర్యాప్తు ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని సిపి తెలిపారు. క్రైమ్ డిటెన్షన్, క్రైమ్ పెట్రోలింగ్ అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష జరపడంతో పాటు నేరాల విషయంలో దర్యాప్తు, సొమ్ము రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అధికారులకు సిపి రివార్డులు అందజేశారు.ఈ సమావేశంలో క్రైమ్స్ డిసిపి కల్మేశ్వర్ సింగన్వర్, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, డిసిపి ఇందిర,ఎడిసిపి నరసింహ రెడ్డి,ఎసిపిలు, సిఐ,డిఐలతో పాటు ఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News