Tuesday, April 30, 2024

వాణిజ్య పన్నుల విధానం భేషు..

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar review with UP Tax Dept Officers

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు దోహదం చేశాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. శనివారం బిఆర్‌కెఆర్ భవన్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సోమేష్‌కుమార్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం 2014లో సుమారు రూ. 23 వేల కోట్లు ఉండగా, గతేడాది దాదాపు మూడు రేట్లకు పెరిగి రూ. 65 వేల కోట్లకు చేరుకొందని ఆయన వివరించారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. వ్యవస్తీకృత మార్పుల ద్వారా శాఖ పని తీరులో గణనీయమైన మార్పు వచ్చిందని తెలియజేశారు. మాన్యువల్ ఆధారిత నోటీసులు, ప్రొసిడింగ్‌ల జారీలను పూర్తిగా తొలగించామని చెప్పారు. ప్రతి స్థాయిలో భౌతిక లక్ష్యాల స్థానంలో నిర్దారిత ఆధారిత లక్ష్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు తదితర చర్యల ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించామని, కొత్తగా, శాఖ పరంగా పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటు చేశామని సిఎస్ పేర్కొన్నారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అమలవుతున్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడం తమకు అవకాశం లభించిందని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎస్. మినిస్టి అన్నారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్, ఐఐటి హైదరాబాద్‌కు చెందిన అదనపు కమిషనర్లు సాయికిషోర్, కాశీ, శోభన్‌బాబు, ఉత్తరప్రదేశ్ అధికారులు పాల్గొన్నారు.

CS Somesh Kumar review with UP Tax Dept Officers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News