Wednesday, May 15, 2024

మూడో వికెట్ కోల్పోయిన చెన్నై…. 112/3

- Advertisement -
- Advertisement -

CSK score 112 runs for 3 wicket

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సిఎస్‌కె 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. డూప్లిసెస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రూతురాజ్ గైక్వాడ్ 33 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డూప్లెసెస్ 50 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో క్రిష్టియన్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. సురేష్ రైనా 24 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో దేవదూత్ పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్రజడేజా(0), అంబటి రాయుడు(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News