Friday, April 26, 2024

యూనిక్‌గా, ఉత్కంఠభరితంగా

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, లీడింగ్ ఫిల్మ్‌మేకర్ వెంకట్ ప్రభు తెలుగు-, తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శుక్రవారం సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది. హీరో విలన్‌ని రక్షించడం, అతనిని చనిపోనివ్వకుండా చేయడం కథాంశం యూనిక్ గా, ఉత్కంఠభరితంగా వుంది. నాగ చైతన్య చట్టానికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్‌గా కనిపించాడు. సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే అండర్ డాగ్ పాత్రలో చైతన్య అద్భుతంగా నటించాడు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News