Sunday, May 5, 2024

కరోనా కట్టడికి సి విటమిన్ పండ్లే తినాలి: ఉద్యానవన శాఖ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా కట్టడికి సి విటమిన్ ఉన్న పండ్లు తినాలని ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలంటే మన దగ్గర లభించే పండ్లను విరివిగా కొనుగోలు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హైబ్రిడ్ పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలన్నారు. తెలంగాణలో లభ్యమయ్యే 48 సరుకులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సర్వే చేయించారని, ఆపిల్ బదులుగా మామిడి పండ్లు తినాలని, కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు తినొద్దని హెచ్చరించారు. ఎన్‌రైప్‌తో మాగబెట్టిన పండ్లను తినాలని, ఎన్‌రైప్‌ను తెలంగాణ ప్రభుత్వం హానకరమైనది కాదని గుర్తించిందన్నారు.  తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 650 మందికి సోకగా 18 మంది మృత్యువాత పడ్డారు. భారత్ దేశంలో కరోనా రోగుల సంఖ్య 12,760కి చేరుకోగా 426 మంది చనిపోయారు.

Cvitamin fruits eat in Telangana says Horticultural

 

Cvitamin fruits eat in Telangana says Horticultural 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News