Monday, April 29, 2024

కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదు: రాహుల్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ మాత్రమే పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లాక్‌డౌన్ కేవలం కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా ప్రరిశ్రమలను ఆదుకోవడానికి ప్రణాళికలు రచించాలని డిమాండ్ చేశారు. కరోనాతో పోరాటానికి వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలని సూచించారు. ర్యాండమ్ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రస్తుతం వ్యూహాత్మకంగా కరోనా వైద్య పరీక్షలు జరగడంలేదని విమర్శలు గుప్పించారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు భారత్ దేశంలో కరోనా రోగులు సంఖ్య 12,760కు చేరుకోగా 426 మంది మృత్యువాతపడ్డారు.

 

Lockdown is in no way solution to Corona says rahul
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News