Sunday, April 28, 2024

లోన్ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Cyber ​​criminals

 

లోన్ పేరుతో మోసం..
రూ.4.31లక్షలు పోగొట్టుకున్న ఆర్మీ జవాన్
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

మనతెలంగాణ, హైదరాబాద్ : లోన్ ఇస్తామని చెప్పి ఆర్మీ జవాన్ నుంచి సైబర్ దొంగలు డబ్బులు కొట్టేశారు. కొంత కాలం క్రితం తిరుమలగిరికి చెందిన ఆర్మీ జవాన్ అశ్విన్‌కుమార్‌కు సైబర్ నేరస్థులు ఫోన్ చేశారు. తాము బజాజ్ ఎలియాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. లోన్ ఇస్తామని చెప్పడంతో నిజమని నమ్మి వారు అడిగిన డాక్యుమెంట్లు పంపించాడు. కొద్ది రోజుల తర్వాత లోన్ మంజూరు అయిందని, ప్రాసెసింగ్ చార్జీలు, జీఎస్టీ కింద డబ్బులు పంపించాలని తెలిపారు. నిజమని నమ్మిన బాధితుడు వారు చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ.4,31,000లు పంపించాడు. తర్వాత పలుసార్లు ఫోన్ చేసినా సైబర్ నేరస్థుల నుంచి స్పందన రాలేదు. ఎన్ని సార్లు అడిగినా సరిగా సమాధానం చెప్పకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే నగర సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News