Friday, May 3, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
Cyberabad CP Stephen Ravindra review on traffic‌
ట్రాఫిక్‌పై సమీక్ష నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సిపి స్టిఫెన్ రవీంద్ర సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ ఎడ్యుకేషన్, ట్రాఫిక్ ఇంజనీరింగ్, లైటింగ్, రోడ్డు మార్కింగ్, జంక్షన్ల అభివృద్ధి, సైన్‌బోర్డులు, బ్లాక్‌స్పాట్స్, యూటర్న్, ఫుట్‌పాత్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, వాటర్ లాగింగ్, డ్రైనేజి, వాటర్ లీకేజీ సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హట్ స్పాట్స్‌ను గుర్తించాలని, వెంటనే తనిఖీలు చేసి రోడ్డు ఇంజనీరింగ్‌లో మార్పులు చేయాలని అన్నారు. మిగతా అన్ని డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించి రోడ్డు భద్రతకు తీసుకోవాల్సి చర్యల గురించి చర్చించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్, ఎడిసిపి శంకర్, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఎసిపి హన్మంతరావు, శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి విశ్వప్రసాద్, బాలానగర్ ట్రాఫిక్ ఎసిపి చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News