Friday, May 3, 2024

2022లో తొలి తుఫాను ‘అసని’

- Advertisement -
- Advertisement -

Asani Cyclone
పుణె: ఈ ఏడాది తొలి తుఫాను మార్చి 21 నాటికి బంగాళాఖాతంలో ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం పేర్కొంది. ఇది తుఫానుగా మారిన తర్వాత, తుఫానను ‘అసని’ అని పిలుస్తారు. దీనికి ఆ పేరును శ్రీలంక పెట్టింది. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో, బంగాళాఖాతం, అరేబియా సముద్రాన్ని కవర్ చేస్తూ మార్చి నుండి మే వరకు రుతుపవనాలకు ముందు నెలలు తుఫాను కాలంగా ఉండనుంది.
తుఫాను దిశ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు ఉండనుంది. కనుక తుఫాను భారత ప్రధాన భూభాగంపై ప్రభావం చూపదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను అండమాన్, నికోబార్ దీవులను దాటుతుంది, మార్చి 20, 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయి.
బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి గురువారం తెల్లవారుజామున హిందూ మహాసముద్రం భూమధ్య రేఖకు ఆనుకుని తూర్పుఈశాన్య దిశగా కదిలింది. ప్రస్తుతం తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ దిశలో పయనిస్తోంది. మార్చి 22న తీరానికి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. తుఫాను సమీపిస్తున్నందున, అండమాన్, నికోబార్ దీవులలో వర్షపాతం పెరుగుతుంది. శుక్రవారం నికోబార్ దీవులపై భారీ వానలు (64 నుంచి 115 మిమీ.) కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News