Tuesday, April 30, 2024

ద.కొరియా కొత్త అధ్యక్షునికి మోడీ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

PM Modi congratulates South Korean president

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షునిగా ఎన్నికైన యూన్ సోక్ యుతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. భారత్-కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రత్యేకంగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో దీని ఆవశ్యకతపై ఉభయ దేశాల అధినేతలు ఒక అంగీకారానికి వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో దక్షిణ కొరియా అధ్యక్షునిగా విజయం సాధించిన యూన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్న వివిధ రంగాల గురించి వారిద్దరూ చర్చించారు. ఇందుకోసం కలసికట్టుగా పనిచేయాలని వారుభయులూ నిర్ణయించారు. భారత్, దక్షిణ కొరియా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ వేడుకలను సంయుక్తంగా నిర్వహించాలని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్లు పిఎంఓ ప్రకటనలో తెలిపింది. సాధ్యమైనంత త్వరగా వీలు చూసుకుని భారతదేశాన్ని సందర్శించవలసిందదిగా యూన్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్థానంలో యూన్ ఇటీవల ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News