Tuesday, May 7, 2024

ఇళ్లపై ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

- Advertisement -
- Advertisement -

Dangerous electrical wires are hanging over houses

వీటిని సరిచేయాలంటే భారీ బడ్జెట్
ఒక్క హైదరాబాద్‌కే రూ.200ల నుంచి 300 కోట్ల నిధులు కావాలి
ప్రణాళికలు రూపొందించిన విద్యుత్ శాఖ అధికారులు

హైదరాబాద్: ఇళ్లపై ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. వీటిని తొలగించేందుకు అయ్యే వ్యయం గురించి విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆయా జిల్లాల ప్రజలు విద్యుత్ శాఖకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని సరిచేయాలంటే విద్యుత్ శాఖ భారీ బడ్జెట్‌ను కేటాయించాలని అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఒక్క నగరంలోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే సుమారుగా రూ.200ల నుంచి 300 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువగా 11కెవి, 33 కెవి లైన్లు ఉండగా, కొన్నిచోట్ల ఎల్‌టీ తీగలు ఇళ్లకు తాకుతుండడంతో వీటిని తొలగించి భూగర్భ కేబుళ్లు వేయాలని అధికారులు పేర్కొంటున్నారు.

అయితే నగరంలో తొలగించాల్సిన తీగలున్న ప్రాంతాలు అధికంగా ఉండటంతో ఏకంగా ఒక పుస్తకాన్నే డిస్కం అచ్చు వేసింది. వ్యయం రూ.320 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీగలను సరిచేయాలంటే సుమారుగా రూ.1,000 నుంచి రూ.1300ల కోట్ల అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇళ్లతో పాటు వ్యవసాయ భూముల వద్ద తీగలు కిందకు వేలాడుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తీగలను సరిచేయాలంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వీటికి ప్రత్నామ్యాయంగా భూగర్భ కేబుల్‌ను వేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కేంద్రం ఆదిత్య స్కీం ఇచ్చే బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News