Tuesday, April 30, 2024

గ్రేటర్‌లో… యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు

- Advertisement -
- Advertisement -

Road repair works in Hyderabad

అధికారులు గుర్తించి పాట్ హోల్స్ 7248
మరమ్మత్తులు చేసినవి 6321
త్వరలో అన్ని పూర్తి చేస్తామంటున్న జిహెచ్‌ఎంసి అధికారులు

మన తెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలుకు దెబ్బతిన్న రోడ్లు, గుంతలను పూడ్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయా సర్కిల్ పరిధిలో యుద్దప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి ప్రజారవాణకు ఇబ్బందులు లేకుండా చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పడు అధికారులకు ఆదేశాలు జారీచేయడంతో వాటికి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. ఈ విషయంలో మేయర్ కార్యాలయం నుంచి కూడా ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టారు. ఇంజనీరింగ్ అధికారులు మేయర్ ఆదేశాలతో పనులను వేగవంతం చేశారు. జూన్ మాసం నుంచి ఇటీవల వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మొత 7428 పాట్ హోల్స్‌ను గుర్తించగా వీటిలో యుద్దప్రాతిపదికన 6321లను గుంతలను పూర్తి చేశారు. సికింద్రాబాద్ జోన్‌లో వర్షాలకు దెబ్బతిన్న 1446 రోడ్లను గుర్తించి వాటిలో 1368 పూర్తి చేశారు. అదే విధంగా కూకట్‌పల్లి జోన్‌లో 1320 గుంతలను గుర్తించి 1141 పూర్తి చేశారు. త్వరలో మిగిలిన గుంతలను పూర్త త్వరలో పూర్తి చేయనున్నారు. శేరిలింగంపల్లి జోన్‌లో 792 గుంటలను గుర్తించి 736 గుంతలకు మరమ్మత్తులు పూర్తి చేశారు. ఖైరతాబాద్ జోన్‌లో 1502 గుంతలను పూర్తి గుర్తింగా వాటిలో 1420 పూర్తి చేశారు. వాటిలో చార్మినార్ జోన్‌లో 1063 గుంతలను గుర్తించి 931లున పూర్తి చేశారు. ఎల్‌బినగర్‌లో 1175 గుంతలున గుర్తింగా వాటిలో 1025 గుంతలను పూర్తి చేశారు. మిగిలిన 621 పాట్ హోల్స్‌ను యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News