Friday, May 3, 2024

అన్ని ఎమోషన్స్‌తో ‘డియర్ మేఘ’

- Advertisement -
- Advertisement -

Dear Megha movie success meet

 

ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘డియర్ మేఘ‘ను థియేటర్‌లలో మిస్ కావద్దని అంటున్నారు సినిమా టీమ్ మెంబర్స్. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ “డియర్ మేఘ చిత్రానికి థియేటర్‌లలో మంచి స్పందన వస్తోంది. ఒక మంచి ఎమోషనల్ మూవీ ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉంది. డియర్ మేఘ చూస్తే ప్రేక్షకులు నవ్వుతారు, ఏడుస్తారు, ఉద్వోగానికి లోనవుతారు…ఇలా అన్ని ఎమోషన్స్ కలుగుతాయి”అని అన్నారు. హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ “డియర్ మేఘకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మేఘ పర్మార్మెన్స్ చాలా బాగుంది. నాకు మదర్ క్యారెక్టర్ చేసిన పవిత్ర లోకేష్ అద్భుతంగా నటించారు. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరి చూడాలంటే డియర్ మేఘ చూడండి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్ సోమయాజుల పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News