Friday, April 26, 2024

టీకాలు తీసుకున్న రెండునెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు

- Advertisement -
- Advertisement -

బూస్టర్ డోసు అవసరం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ అధ్యయనం చేశామన్నారు.

ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ : కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న రెండు మూడు నెలలకే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతోందని ఐసిఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చి సెంటర్ (భువనేశ్వర్) అధ్యయనంలో వెల్లడైంది. కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న 614 మందిపై చేసిన అధ్యయనంలో ఆరు నెలల పాటు యాంటీబాడీల స్థాయి పరిశీలించినట్టు డాక్టర్ దేవదత్త భట్టాచార్య చెప్పారు. కొవిషీల్ట్ రెండు డోసులు తీసుకున్నవారిలో రెండు నెలల లోపునే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతోందని,కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలో మూడు నెలల లోపే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతోందని తాము గుర్తించినట్టు చెప్పారు. బూస్టర్ డోసు అవసరం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ అధ్యయనం చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు 75 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ ఏడాది చివరినాటికి దేశం లోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడీ అధ్యయనం ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News