Monday, May 6, 2024

24 వరకు డిఇఇసెట్ దరఖాస్తు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డిఇఐఇడి), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డిపిఎస్‌ఇ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిఇఇసెట్ దరఖాస్తు గడుడును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా గతంలో ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉండగా, దానిని మరో రెండు రోజులు పొడిగించారు. జూన్ 1వ తేదీన డిఇఇసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం http://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News