Friday, May 3, 2024

ఓటమికి నైతిక బాధ్యత.. పిసి చాకో రాజీనామా

- Advertisement -
- Advertisement -

PC-Chacko-resigns

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పిసి చాకో బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా చేజిక్కించుకోనందుకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చాకో రాజీనామా ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే. గత ఏడాది ఆగస్టులోనే తనను ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని చాకో కోరగా అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. అదీగాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం మీడియాతో కాంగ్రెస్ ప్రతినిధులు మాట్లాడుతూ పార్టీ పునర్నిర్మాణ చర్యలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2014 నవంబర్‌లో ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా చాకో బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది.

Delhi Congress in charge PC Chacko resigns, Delhi Congress Chief Subhash Chopra resigned to his post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News