Wednesday, May 1, 2024

బొగ్గు కుంభకోణంలో హెచ్‌సి గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బొగ్గు బ్లాకుల కేటాయింపులో జరిగిన అక్రమాలకు సంబంధించిన బొగ్గు కేసులో కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాకు ఢిల్లీ కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఇదే కేసులో బొగ్గు శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి కెఎస్ క్రోఫాకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా, గుప్తాకు లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్ సోమవారం తీర్పు వెలువరించినట్లు ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాది ఒకరు తెలిపారు. లోహర ఈస్ట్ కోల్ బ్లాకు కేటాయింపునకు సంబంధించిన కేసులో నిందితులిద్దరూ కుట్రపూరిత నేరానికి, అవినీతికి, మోసానికి, విశ్వాస ఘాతుకానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.

కాగా..ఇదే కేసులో కుట్రపూరిత నేరానికి, మోసానికి పాల్పడిన గ్రేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ ముకేష్ గుప్తాకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కంపెనీకి మరో రూ.2 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.

Delhi Court Sentences 3 years Jail to HC Gupta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News