Sunday, April 28, 2024

ఢిల్లీలో హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమే

- Advertisement -
- Advertisement -
Delhi covid outbreak shows herd immunity
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు సహకరించే హెర్డ్ ఇమ్యూనటీ దేశ రాజధాని ఢిల్లీలో చాలా కష్టమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొవిడ్ రెండో దశ ఢిల్లీని కకావికలం చేసిందని, అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమేనని, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు డెల్టా బారిన పడడం లేదా బూస్టర్ డోసు తీసుకోవడం మాత్రమే మార్గమని స్పష్టం చేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సిఎస్‌ఐఆర్) కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ కోపెన్‌హెగెన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సహా మరికొందరు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2020 లో ఢిల్లీలో కరోనా విజృంభణకు కారణమైన వేరియంట్‌ను కచ్చితంగా చెప్పలేమన్న బృందం కొన్ని కేసుల్లో డెల్టా వేరియంట్ బయటపడిందని పేర్కొంది. ఇది కూడా ఎక్కువగా విదేశీ ప్రయాణికుల్లోనని తెలిపింది.

అయితే 2021 మార్చి నాటికి ఢిల్లీలో ఈ వేరియంట్ కేసులు 40 శాతం వెలుగు చూశాయని అనంతరం ఏప్రిల్ లో డెల్టా విజృంభించిందని వివరించింది. కేంబ్రిడ్జి యూనివర్శిటీ శాస్త్రవేత్త రవిగుప్తా మాట్లాడుతూ అంటువ్యాధులను అంతం చేయడంతో హెర్డ్ ఇమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఢిల్లీ వాసులపై గత వేరియంట్లు చూపిన ప్రభావం ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు సరిపోదు. ఇది సాధించేందుకు ఉన్న మార్గం డెల్టా వేరియంట్ సోకి దాని నుంచి కోలుకోవడం లేదా బూస్టర్ డోసు ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం అని పేర్కొన్నారు. 2020 నవంబరులో రాజధాని ఢిల్లీలో ప్రతిరోజూ దాదాపు 9 వేల కేసులు నమోదయ్యేవి. డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో ఈ సంఖ్య తగ్గింది. కానీ మరుసటి నెల నుంచి పరిస్థితులు మారిపోయాయి. మార్చిలో 2 వేలుగా నమోదైన కేసులు ఏప్రిల్‌లో 20 వేలకు పెరిగిపోయాయి. అనంతరం రోజూ వేలల్లో కేసులు నమోదవుతూ వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు లభించక ఆస్పత్రి ఆవరణ లోనే ప్రాణాలు పోయిన సంఘటనలు ఎన్నో . కాగా ఢిల్లీలో ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News