Monday, May 6, 2024

ఛత్‌పూజ నిషేధ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

Delhi HC refuses to grant permission for Chhath Puja

న్యూఢిల్లీ: బహిరంగ స్థలాలలో ఛత్‌పూజ నిర్వహణపై విధించిన నిషేధం విషయంలో జోక్యానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దేశ రాజధానిలో కోవిడ్ 19 ప్రస్తుత మూడో దశలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. దీనితో నదుల ఒడ్డున , ఇతరత్రా బహిరంగ ప్రదేశాలలో ఈ పూజల నిర్వహణను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిషేధించింది. అయితే దీనిని సవాలు చేస్తూ దుర్గా జన సేవా ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సుబ్రమోణియం ప్రసాద్‌లు రూలింగ్ వెలువరించారు. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇది అధికార యంత్రాంగానికి సంబంధించిన అంశం అయినందున ఇందులో తాము జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు

Delhi HC refuses to grant permission for Chhath Puja

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News