Friday, April 26, 2024

డిసెంబర్‌లో ‘రాధే శ్యామ్’ పూర్తి

- Advertisement -
- Advertisement -

Radhe Shyam Shooting will Completes end of December

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ చిత్రాల్లో యువ దర్శకుడు రాధాకృష్ణతో తెరకెక్కిస్తున్న ‘రాధే శ్యామ్’ ఒకటి. ఇక ఇటీవలే ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యం ఇటలీలో ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని వచ్చింది. ఇక ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా కేవలం క్లైమాక్స్ మాత్రమే మిగిలిన ఈ చిత్రం ఆ షూట్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం వచ్చే వారంలో షూటింగ్‌ను ప్రారంభించి డిసెంబర్ రెండు లేదా మూడో వారానికల్లా చిత్రీకరణ పూర్తిచేయనున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రం పూర్తయిన వెంటనే జనవరిలో ప్రభాస్ తన డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ను దర్శకుడు ఓంరౌత్‌తో మొదలు పెట్టనున్నాడట.

Radhe Shyam Shooting will Completes end of December

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News